సీఎం చంద్రబాబుపై కేసులు సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పిటిషన్‌కు సంబంధించి ఒక్క మాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని జస్టిస్ బేలా త్రివేది హెచ్చరించారు. ఇది పూర్తి స్థాయిలో తప్పుడు పిటిషన్ అని ధర్మాసనం స్పష్టం చేసింది. సీఐడీ కేసులు సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టు న్యాయవాది బాలయ్య పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.