హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు

82చూసినవారు
హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
TG: హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 6 నెలల్లోనే 100 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లను సదరు ముఠా చేసినట్లు తెలుస్తోంది. కిడ్నీ ఆపరేషన్స్ కోసమే హైదరాబాద్ లో జనని, అలకనంద, అవని ఆస్పత్రులను స్థాపించినట్లు సమాచారం. ఒక్కో ఆపరేషన్ కు రూ.45-60 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. HYD, VZG, చెన్నైకు చెందిన పలువురు డాక్టర్లు ఈ ముఠాలో ఉన్నట్లు వెల్లడైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్