AP: తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలన వల్ల ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బిహార్ కంటే దిగజారిందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఆయా ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, వాటి ద్వారా సంపద సృష్టికి అవకాశం ఉందన్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగవ్వగానే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేస్తామన్నారు.