టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేడు సమావేశం కానుంది. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో మంగళవారం సాయంత్రం ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుండడంతో బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.