దర్శి నియోజకవర్గం, తాళ్లురు మండలము తూర్పు గంగవరం, సోమవరపాడు గ్రామాల్లో కోతులు ప్రజల పై దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల గురించి పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లటం జరిగింది. పంచాయితీ కార్యదర్శి A. అజయ్ కుమార్ గురువారం స్పందించి కొండముచు ను తూర్పు గంగవరం, సోమవరపాడు గ్రామాలలో కోతులు సంచరించే ప్రదేశాలలో విడిచిపెట్టారు. కోతులు భయంతో పారిపోయాయి.