ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని యోగా టీచర్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని గుర్తు చేస్తూ నాటకం వేశారు. బ్రిటిష్ వారితో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాడిన తీరును నటించి చూపించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నాటకాన్ని చూసిన విద్యార్థులు కేరింతలు కొట్టారు.