ప్రకాశం జిల్లా కొమరోలు పట్టణంలో ఘనంగా పారువేట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీలో భాగంగా బుధవారం కనుమ పండుగ పురస్కరించుకొని పారువేట కార్యక్రమం నిర్వహించినట్లుగా నిర్వహకులు తెలిపారు. అలానే రాములవారికి గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించారు. యువకులకు పరుగు పందెం నిర్వహించారు. పోటీలలో విజయం సాధించే యువకులకు నగదు బహుమతులను అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.