ప్రకాశం జిల్లా గిద్దలూరు సెయింట్ పాల్స్ కళాశాల సమీపంలోని నీటి కుంటలో పడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది. మృతుడు హుస్సేన్ (14) అనే బాలుడిగా పోలీసులు గుర్తించారు. మృతుడు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందాడా లేక ఈతకు వెళ్లి మృతి చెందాడ అనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.