గిద్దలూరులో దీపం పథకం 2 ను శుక్రవారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రారంభించారు. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటిని ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని అన్నారు. గతంలో మహిళలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి సీఎం నారా చంద్రబాబు నాయుడు దీపం పథకం ప్రవేశపెట్టారని అశోక్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.