ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని సాయి చైతన్య డిగ్రీ కళాశాలలో సోమవారం కడపలో హత్యకు గురైన దస్తగిరమ్మ కు మేమున్నం సేవా సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవ సంస్థల సభ్యులు, విద్యార్థులు నివాళులు అర్పించారు. ప్రస్తుతం జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో విద్యార్థినీలు తీసుకోవలసిన జాగ్రత్తలు వారికి వివరించి చెప్పారు. అఘాయిత్యాలకు పాల్పడే నిందితులను కఠినంగా శిక్షించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అన్నారు.