ప్రకాశం జిల్లా గిద్దలూరులో ప్రమాదవశాత్తు జనసేన పార్టీ కార్యకర్త లంక లక్ష్మణమూర్తి మృతి చెందాడు. గతంలో జనసేన కార్యకర్తకు బీమా సౌకర్యం కల్పించడంతో ఐదు లక్షల రూపాయలను ఆదివారం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కార్యకర్త సంబంధిత కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు జనసేన పార్టీ ఇన్ చార్జ్ బెల్లంకొండ సాయిబాబు పాల్గొన్నారు.