పామూరు మండలం వగ్గంపల్లి గ్రామ సమీపంలో ఉన్న మన్నేరు వాగులో అరుదైన ఆవిష్కరణ వెలుగుచూసింది. ఇటీవల వడోదరలోని ఎమ్మెస్ విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం, యుఎస్, ఆస్ట్రేలియా, జర్మనీకి చెందిన పరిశోధకుల బృందంతో కలిసి చేసిన పరిశోధనల్లోఓ అరుదైన పక్షి గూడును కనుకొన్నారు. వారికి కనిపించిన గూడు 41వేల ఏళ్ల క్రితం నాటి నిప్పు కోడి గూడు అని నిర్ధారించారు.