సీఎస్ పురం మండలంలోని నారాయణ స్వామి ఆలయంలో ఆదివారం భక్తులు తెల్లవారుజామున నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు ఆదివారం కావడంతో భక్తులు తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. గోమాతకు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. దేవస్థాన వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భక్తులకు వసతులు సమర్పించారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.