ఈదురు గాలులతో కూడిన వర్షం

65చూసినవారు
సింగరాయకొండ మండలంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా శనివారం తెల్లవారుజామున నుండి వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. గ్రామాల్లో రోడ్లన్నీ నిండుకుండలా తలపిస్తున్నాయి. కొన్ని రోజులుగా వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్