కొండేపి: మద్యం షాపు వద్దంటూ నిరసన

56చూసినవారు
కొండేపి: మద్యం షాపు వద్దంటూ నిరసన
కొండేపిలోని గొడుగుల పాలెం వద్ద మద్యం షాపు ఏర్పాటు చేయవద్దంటూ స్థానిక ప్రజలు బుధవారం నిరసనకు దిగారు. మద్యం షాపు సమీపంలోనే పాఠశాలలు ఉన్నాయని ఆ ప్రాంతంలో మద్యం షాపు ప్రారంభించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలు నిరసన తెలిపారు. అక్కడికి చేరుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు వారితో మాట్లాడి సముదాయించారు. పై అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్తామన్నారు.

సంబంధిత పోస్ట్