పాకల బీచ్ లో పర్యాటకులు సందడి

71చూసినవారు
పాకల బీచ్ లో పర్యాటకులు సందడి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో ఆదివార పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా గడిపేందుకు జిల్లా నలుమూలల నుంచి బీచ్ కు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. సముద్ర కెరటాల్లో స్నానాలు చేస్తూ ఆనందంగా గడిపారు. చిన్నారులు కెరటాలతో ఒడ్డుకు కొట్టుకొస్తున్న ఇసుక తెన్నెలపై ఆటలాడుకున్నారు. ముఖ్యంగా యువత సెల్పీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. మెరైన్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్