కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్‌లో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో తాత్కాలిక గేటు ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సాయంత్రం వరకు కష్టపడిన అధికారులు.. గేటు ఏర్పాటుకు అడ్డుగా ఉన్న కౌంటర్ లాక్, స్కై వాక్ లను భారీ క్రేన్ల సాయంతో తొలగించారు. వీటిని తొలగించటం ద్వారా గేటు ఏర్పాటు చేయటానికి వీలుంటుంది. ఇప్పటికే గేటులోని మూడు పలకలు డ్యాం వద్దకు చేరుకున్నాయి. మరో రెండు ఎలిమెంట్లు రావాల్సి ఉంది. గేటు ఏర్పాటు చేసే ప్రక్రియ శనివారం ఉదయం మొదలు కానుంది.