పేకాట శిబిరంపై పోలీసులు దాడులు

85చూసినవారు
పేకాట శిబిరంపై పోలీసులు దాడులు
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలోని చిమట గ్రామంలో పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో మర్రిపూడి ఎస్ఐ శివ బసవరాజు ఆ ప్రాంతంలో గురువారం దాడులు చేశారు. ఆ సమయంలో అక్కడ పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసి వారివద్ద రూ. 28, 170 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా పేకాట ఆడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో మర్రిపూడి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్