పొదిలి: గుర్తుతెలియని వాహనం ఢీకొని జింక మృతి

79చూసినవారు
ప్రకాశం జిల్లా పొదిలి మండలం కంబాలపాడు సమీపంలో ఒంగోలు కర్నూలు హైవేపై సోమవారం గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో జింక మృతి చెందింది. జింక రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొన్నట్లుగా స్థానికులు గుర్తించారు. విషయాన్ని స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు జింకకు పంచనామా నిర్వహించి అనంతరం ఖననం చేసినట్లుగా అటవీశాఖ అధికారులు తెలిపారు. జింక మృతిపై వాహనదారులు విచారం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్