పొదిలిలోని చెరువులో దూకి బుధవారం ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. బాప్టిస్ట్ పాలెంకు చెందిన సుశీల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంది. కొద్దిగా రోజుల క్రితం భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. మనస్థాపంతో ఉన్న సుశీల అనారోగ్య సమస్యలను తట్టుకోలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో మహిళ మృతదేహాన్ని చెరువు నుంచి వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.