పెద్దారవీడు మండలం ఎస్. కొత్తపల్లి గ్రామంలో విషాద ఘటనలో హృదయాలను కదిలించే దృశ్యాలు కనిపించాయి. ఆదివారం సాయంత్రం ముగ్గురు విద్యార్థులు ఈతకు వెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ముద్దులొలికే చిన్నారుల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఇంత చిన్న వయసులో ఇంత దారుణం ఏంటని వారు రోధిస్తున్న తీరు చూపురులకు కన్నీరు తెప్పిస్తున్నాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.