హైదరాబాద్ లో జరిగిన ప్రమాదంలో ప్రకాశం జిల్లా కొనకమిట్ల మండలం సిద్దవరానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం జీడిమెట్ల పరిధి ఎస్సార్ నాయక్ నగర్ రమణయ్య (43) మేడపైన గోడపై కూర్చుని సిగరెట్ తాగుతుండగా, ప్రమాదవశాత్తు జారి కింద గ్రానైట్ రాళ్లపై పడ్డాడు. సోమవారం ఉదయం స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.