తర్లుపాడులోని బీసీ కాలనీలో మద్యం షాపు ఏర్పాటు చేయవద్దని శుక్రవారం ప్రజలు నిరసనకు దిగారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి సోదరుడు రామిరెడ్డి తో ప్రజలు వాగ్వాదానికి దిగారు. ఇక్కడ మద్యం షాపు పెట్ట వద్దంటు నిలదీయడంతో ఎవరికి ఇష్టం లేకపోయినా ఇక్కడ మద్యం షాపు ఏర్పాటు చేస్తామని ఆయన అనడంతో మద్యం షాపుని ధ్వంసం చేస్తామని స్థానికుడు హెచ్చరించాడు. పోలీసులు కల్పించుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.