ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం స్థానిక ప్రజలు నిరసనగ దిగారు. కొండేపల్లి రోడ్డు లో ఉన్న 245 గజాల స్థలాన్ని ప్రజా ప్రయోజనా అవసరాలకు ఉపయోగించాలని నిరసన కారులు అధికారులను డిమాండ్ చేశారు. వేరే అవసరాలకు స్థలం కేటాయించడాన్ని ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు హామీ ఇవ్వాలని కోరారు. అధికారులు నిరసనకారులతో మాట్లాడి సముదాయించేందుకు ప్రయత్నిస్తున్నారు.