తర్లుపాడు: కబ్జాదారుడిపై ఫిర్యాదు

65చూసినవారు
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కారుమానుపల్లికి చెందిన మహబూబి కబ్జా దారుడు నుంచి తన భూమిని కాపాడాలంటూ మీకోసం కార్యక్రమంలో సోమవారం తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. 2005లో వ్యవసాయం కోసం ప్రభుత్వం తనకు కేటాయించిన 2 ఎకరాల భూమిని తన గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కబ్జా చేసినట్లుగా కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా తనకు న్యాయం జరగకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆమె వాపోయింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్