ఒంగోలు నగరంలో శుక్రవారం ఉదయం నాలుగు చోట్ల అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం క్యాంటీన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మెనూ పరిశీలించి స్థానికులతో కలిసి టిఫిన్ చేసి మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల ఆకలి తీర్చటమే లక్ష్యమని తెలిపారు.