హిజ్రాలు ఆత్మగౌరవంతో బ్రతకాలి: ఎస్పి

82చూసినవారు
హిజ్రాలు ఆత్మగౌరవంతో బ్రతకాలి: ఎస్పి
హిజ్రాలు ఆత్మగౌరావంతో బ్రతకాలని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ. ఆర్ దామోదర్ తెలిపారు. ఒంగోలులో సోమవారం హిజ్రాలు ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిజ్రాలు ఎదుర్కొంటున్న సామాజిక వివక్ష అణచివేతల నుండి గర్వంగా సభ్య సమాజంలో తలెత్తుకుని బ్రతకాలని ఎస్పీ తెలిపారు. హిజ్రాలు గ్రూపులుగా విడిపోయి శాంతిభద్రతల సమస్యలు సృష్టించడం, బలవంతపు వసూళ్లకు పాల్పడితే ఆత్మగౌరవం దెబ్బతింటుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్