ఒంగోలు: శబ్ద కాలుష్యం చేస్తే చర్యలు తప్పవు: ఎస్పీ

57చూసినవారు
వాహనదారులు శబ్ద కాలుష్యం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలకు బిగించిన మోడీపై సైలెన్సర్లను తొలగించి ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ వద్ద శుక్రవారం రోడ్డు రోలర్ సహాయంతో ధ్వంసం చేపించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వాహనదారులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా, శబ్ద కాలుష్యం లేకుండా నియమాల ప్రకారం వాహనాలు నడపాలన్నారు.

సంబంధిత పోస్ట్