
చీమకుర్తి: వైసీపీ శ్రేణులకు బూచేపల్లి వెంకాయమ్మ సూచనలు
చీమకుర్తి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో గురువారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరూ పాటుపడాలని, ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా ఉండాలని పేర్కొన్నారు కార్యక్రమంలో మాజీ మంత్రి మేరుగ నాగార్జున, నాయకులు పాల్గొన్నారు.