ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో బుధవారం స్థానిక శాఖా గ్రంధాలయంలో మహాత్మా గాంధీ 155వ జయంతిని పురస్కరించుకుని, గ్రంధపాలకుడు జి. రామాంజి నాయక్ మరియు ప్రముఖ కవి, రచయిత, శ్రీశ్రీ కళావేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గొట్టిముక్కుల నాసరయ్య ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తత్వం బోధించే భగవద్గీత, పెదాలపై నిరంతరం చెరగని చిరునవ్వు తరతరాలకూ ఆదర్శంగా నిలిచేనని ఆయన దేశ సేవలను కొనియాడారు.