వెలిగొండపై మాట్లాడే అర్హత జగన్ కు లేదు - ఎరిక్షన్ బాబు

52చూసినవారు
వెలిగొండపై మాట్లాడే అర్హత జగన్ కు లేదు - ఎరిక్షన్ బాబు
అధికారంలో ఉన్న అయిదేళ్లు వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంపై కపట ప్రేమ చూపించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దీనిపై మాట్లాడే అర్హత లేదని ఎర్రగొండపాలెం కూటమి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. ప్రాజెక్టుపై జగన్ ట్విట్టర్లో పెట్టిన పోస్టుకు సంబంధించి సోమవారం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు పూర్తికాకుండానే పూర్తయినట్లు నియోజకవర్గ ప్రజలను మోసం చేసినట్లు ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్