ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తనపై అక్రమ కేసులు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం చంద్రశేఖర్ కు పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. మొత్తం 4 కేసులు ఎమ్మెల్యే పై నమోదయాయి. మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే చంద్రశేఖర్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదని ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.