సాగర్ కెనాల్ నుండి కొరిశపాడు మండలంలోని పమిడిపాడు మేజర్ కాలువకు 132 క్యూసెక్ లు నీటిని విడుదల చేసినట్లు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శివయ్య మంగళవారం తెలియజేశారు. చెరువులను నింపేందుకు నీటిని విడుదల చేసినందున రైతులు మేజర్ కాలువ వద్ద ఇంజన్లు పెట్టవద్దని ఆయన సూచించారు. రైతులందరూ సహకరించాలని ఆయన కోరారు. సాగర్ నీరు నూజిల్లపల్లి వరకు చేరాలంటే 250 క్యూసెక్ లు అవసరమని శివయ్య పేర్కొన్నారు.