పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం: మంత్రి గొట్టిపాటి
బల్లికురవ మండలం వేమవరం గ్రామంలో ఇండస్ట్రియల్ ఫీడర్ కు సంబంధించి, 33/11 కె. వి సబ్ స్టేషన్ పరిధిలో 50 విద్యుత్ కనెక్షన్ల వలన తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, కొన్ని రోజుల క్రితం మంత్రి గొట్టిపాటి దృష్టికి తీసుకువెళ్లారు. సమస్య పై స్పందించిన మంత్రి రూ. 24 లక్షలతో సబ్ స్టేషన్ నందు నూతనంగా 1 బ్రేకర్, 2 కి. మీ మేర 11 కె. వి విద్యుత్ లైన్ ఏర్పాటు చేశారు. విద్యుత్ అందుతుందని సోమవారం మంత్రి తెలిపారు.