
దర్శి: విద్యుత్ షాక్ తో మృతి.. నివాళి అర్పించిన బూచేపల్లి
దర్శి మండలం పాపిరెడ్డి పల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తో వైసీపీ నాయకుడు సుబ్బులు కుమారుడు వెంకటేశ్వర రెడ్డి మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గురువారం సుబ్బులు కుటుంబాన్ని పరామర్శించి మృతునికి నివాళి అర్పించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.