దర్శి: వైసీపీ చేసిన తప్పే కూటమి చేస్తుంది

78చూసినవారు
కూటమి ప్రభుత్వంపై దర్శి కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ వెంకటకృష్ణారెడ్డి బుధవారం తన కార్యాలయంలో మండిపడ్డారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాం నాటి పథకాలు, జిల్లాల పేర్లను ఇప్పుడు మార్చడాన్ని ఖండిస్తూ ఇది సరైన పద్ధతి కాదన్నారు. గతంలో ఎన్టీఆర్ పేరును వైసీపీ మార్చి చేసిన తప్పే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుందన్నారు. వైయస్సార్ ను తెలుగు ప్రజలు దేవుడిలా పూజిస్తారని రాత్రికి రాత్రి వైయస్సార్ పేరును తీసేయడం ఏంటని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్