ముంబైపై గుజరాత్ ఘన విజయం

76చూసినవారు
ముంబైపై గుజరాత్ ఘన విజయం
IPL-2025లో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 రన్స్ తేడాతో గుజరాత్ టైటాన్స్‌‌ ఘన విజయం సాధించింది. GT ఇచ్చిన 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై విఫలమైంది. MI జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో సూర్య (48), తిలక్ (39) తప్ప మిగతా వారెవరూ రాణించలేదు. GT బౌలర్లలో సిరాజ్ 2, ప్రసిద్ధ్‌ 2 వికెట్లు తీయగా.. రబడ, సాయి కిషోర్ తలో వికెట్ తీశారు.

సంబంధిత పోస్ట్