కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి తల్లితో సహా ముగ్గురు పిల్లలు మరణించారు.
ఎల్లారెడ్డి మండలం వెంకటాపురానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు కుమారులు, కుమార్తెతో కలిసి బట్టలు ఉతికేందుకు స్థానిక చెరువు వద్దకు వెళ్లింది. బట్టలు ఉతికే క్రమంలో అందరూ చెరువులో పడి చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ముగ్గురి మృతదేహాలు దొరికాయి. కుమార్తె మృతదేహం కోసం గాలిస్తున్నారు.