AP: రాష్ట్రవ్యాప్తంగా భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఇవాళ 126, రేపు 15 మండలాల్లో వడగాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి జిల్లా చింతూరులో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. విజయనగరంలో 23, శ్రీకాకుళంలో 20, తూ.గో.లో 19, మన్యంలో 13, అనకాపల్లిలో 11, కాకినాడలో 7, అల్లూరిలో 7, ఏలూరులో 7, కోనసీమలో 7, ఎన్టీఆర్‌లో 5, గుంటూరులో 3 జిల్లాల్లో ఆదివారం వడగాలులు వీస్తాయని అంచనా వేసింది.