
దర్శి: కోడిపందాలు ఆడుతున్న పదిమంది అరెస్ట్
తాళ్లూరు మండలంలోని నాగం బొట్ల వారి పాలెం గ్రామ శివారులో అక్రమంగా పేకాట శిబిరాలు, కోడిపందాలు నిర్వహిస్తున్న వారిపై ఆదివారం పోలీసు అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు అక్రమంగా జూదమాడుతున్న పదిమంది పేకాట ఆడుతున్న వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి 16, 000 నగదును, కోడిపుంజులను, 8 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు.