దర్శి: విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ

71చూసినవారు
దర్శి లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా మంగళవారం సైకిళ్లను పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ మండల అధ్యక్షులు మానుగంటి కోటేశ్వరరావు ఈ సైకిల్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ పేదలను ఆదుకునేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్