దర్శి: ఆలయంలో హుండి చోరీ

82చూసినవారు
దేవాలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయంలో ఉన్న హుండీని దొంగలు పగలగొట్టి పొలాల్లోకి తీసుకువెళ్లి హుండీలో ఉన్న నగదును దోచుకు వెళ్లారు. ఈ సంఘటన కురిచేడు మండలంలోని గంగ దొనకొండ గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో శనివారం చోటు చేసుకున్నది. పొలాల్లో ఉన్న హుండీని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్