ప్రకాశం జిల్లా దర్శిలో సోమవారం సంక్రాంతి పురస్కరించుకొని స్థానిక టిడిపి ఇన్ ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో స్థానిక మహిళలు పాల్గొని సంక్రాంతి పండుగను గుర్తుచేస్తూ ముగ్గులు వేశారు. ముగ్గులను పరిశీలించిన గొట్టిపాటి లక్ష్మి మహిళలను అభినందించారు. ముగ్గుల పోటీలలో ప్రతిభ చాటిన మహిళలకు ఆమె చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు.