దర్శిలో అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపిల మధ్య ఫ్లెక్సీల రగడ రాజకుంది. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి విద్యుత్ ఛార్జీల పెంపుపై శుక్రవారం నిరసనలు తెలిపిన నేపథ్యంలో దర్శిలో టిడిపి నేతలు విద్యుత్ భారాలను జగన్ పెంచారంటూ గణాంకాలతో ఫ్లెక్సీలు వేశారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల నేతలు దర్శిలోని గడియార స్తంభం సెంటర్ కు చేరుకుని వాదనకు దిగారు. ఎస్సై మురళి ఇరుపార్టీల నేతలకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు.