గుండ్లమోటు ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్న వరద నీరు

51చూసినవారు
గిద్దలూరు సమీపంలోని గుండ్లమోటు ప్రాజెక్టుకు వరదనీరు భారీగా వచ్చి చేరుతుంది. గత కొద్దిరోజులుగా గిద్దలూరు నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన వర్షాలకు వరద నీరంతా ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది. వస్తున్న వరద నీటిని స్థానిక రైతన్నలు బుధవారం ప్రాజెక్టు వద్దకు చేరుకొని చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వస్తున్న వరద నీటితో స్థానికంగా భూగర్భ జలాలు పెరిగి రైతులకు చెందిన నీటి బోర్లకు పుష్కలంగా నీరు వస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్