గిద్దలూరు: పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్

72చూసినవారు
గిద్దలూరు: పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దంతేరపల్లి గ్రామ సమీపంలోని పొలాలలో పేకాట ఆడుతున్న నలుగురిని అర్బన్ సీఐ సురేష్ ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తుల వద్ద నుంచి రూ. 9, 300 నగదును స్వాధీనం చేసుకున్నామని సీఐ వెల్లడించారు. పేకాట ఆడుతున్న వారిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించి వారిపై కేసు నమోదు చేశామని సురేష్ తెలిపారు. దాడుల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్