ఘనంగా హనుమాన్ జయంతి

81చూసినవారు
ఘనంగా హనుమాన్ జయంతి
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పొదలకుంటపల్లి గ్రామంలో శనివారం శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హనుమాన్ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత అర్చకులు అందించిన తీర్థప్రసాదాలు భక్తులు స్వీకరించారు. హనుమాన్ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకమైనదని అర్చకులు భక్తులకు తెలిపారు. ఆలయానికి వస్తున్న భక్తుల కొరకు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు.