రంగాపురంలో ఘనంగా మొహరం పండుగ వేడుకలు

74చూసినవారు
అర్ధవీడు మండలం రంగాపురం గ్రామంలో బుధవారం మొహరం పండగ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రకాశం జిల్లాలోనే అర్ధవీడులో జరిగే మొహరం పండుగ వేడుకలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ వేడుకలు చూసేందుకు జిల్లా నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. మత సామరస్యాన్ని చాటుతూ ప్రజలు పీర్లను దర్శించుకుని తమ మొక్కులను చెల్లించారు. అనంతరం పీర్లను ఎత్తుకొని నృత్యాలు చేశారు. నిప్పుల గుండంలో నిప్పులను తొక్కి తమ భక్తిని చాటారు. ప్రజలు ఈ మొహరం పండుగ వేడుకలు చూసేందుకు భారీగా తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్