'కేవైసీ అప్‌డేట్ చేయకపోతే నంబర్ బ్లాక్ అవుతుంది' అంటూ నయా మోసానికి తెరలేపిన స్కామర్లు: TRAI

81చూసినవారు
'కేవైసీ అప్‌డేట్ చేయకపోతే నంబర్ బ్లాక్ అవుతుంది' అంటూ నయా మోసానికి తెరలేపిన స్కామర్లు: TRAI
సైబర్ నేరగాళ్లు తాజాగా కేవైసీ అప్‌డేట్ పేరుతో కొత్త మోసానికి తెరలేపారు. 'మీ సిమ్ కార్డు వివరాలలో సమస్యలు ఉన్నాయి. వెంటనే కేవైసీ అప్‌డేట్ చేయండి. లేదంటే మీ మొబైల్ నంబర్ బ్లాక్ అవుతుంది' అంటూ వినియోగదారులకు కాల్స్ లేదా sms చేస్తున్నారని భారత టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ (TRAI) తెలిపింది. ఇలా జరగకుండా ఉండాలంటే ఆధార్ సహా ఇతర పత్రాలు అప్‌లోడ్ చేయమని లింక్ లు పంపుతున్నారని, వీటిని క్లిక్ చేసి డబ్బు పొగొట్టుకోవద్దని ట్రాయ్ సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్