గిద్దలూరులో కొండచిలువ కలకలం

73చూసినవారు
గిద్దలూరులో మంగళవారం కొండచిలువ కలకలం రేపింది. స్థానిక ఆర్ అండ్ బి బంగ్లా గెస్ట్ హౌస్ సమీపంలో కొండచిలువ రోడ్డును దాటుతూ స్థానిక ప్రజలకు కనిపించింది. దీంతో హడలిపోయిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు కొండచిలువ ఉన్న ప్రాంతానికి చేరుకొని కొండ చిలువను బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొండచిలువను పట్టుకుని స్థానిక నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెడతామన్నారు.

సంబంధిత పోస్ట్